వాట్సప్ మెస్సేజ్‌ కారణంగా ఇద్దరు అరెస్ట్

|

Mar 02, 2019 | 3:46 PM

హైదరాబాద్: వాట్సప్‌లో ఏ మెస్సేజ్ పడితే ఆ మెస్సేజ్ పోస్ట్ చేస్తే ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్‌లోని మాల్కాజ్‌గిరిలో అభ్యంతరకరమైన మెస్సేజ్ పోస్ట్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన ఒక మెంబర్‌తో పాటు గ్రూప్ అడ్మిన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జొమాటోలో డెలివరీ బోయ్‌గా పని చేసే వెంకటేశ్ అనే వ్యక్తి లాయల్ పార్ట్‌నర్స్ ఎమర్జెన్సీ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. అయితే ఈ గ్రూప్‌లో సభ్యుడైన […]

వాట్సప్ మెస్సేజ్‌ కారణంగా ఇద్దరు అరెస్ట్
Follow us on

హైదరాబాద్: వాట్సప్‌లో ఏ మెస్సేజ్ పడితే ఆ మెస్సేజ్ పోస్ట్ చేస్తే ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్‌లోని మాల్కాజ్‌గిరిలో అభ్యంతరకరమైన మెస్సేజ్ పోస్ట్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన ఒక మెంబర్‌తో పాటు గ్రూప్ అడ్మిన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జొమాటోలో డెలివరీ బోయ్‌గా పని చేసే వెంకటేశ్ అనే వ్యక్తి లాయల్ పార్ట్‌నర్స్ ఎమర్జెన్సీ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు.

అయితే ఈ గ్రూప్‌లో సభ్యుడైన మహ్మద్ మునీర్ గత నెల 26న జాతీయ జెండాను తగలబెడుతున్న ఒక ఫొటోను పెట్టాడు. దీంతో దీనిపై అదే గ్రూప్‌లో ఉన్న మరో మెంబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహ్మద్ మునీర్‌తో పాటు గ్రూప్ అడ్మిన్ వెంకటేశ్‌ను కూడా అరెస్ట్ చేశారు.