అహోబిలం గుడి పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్

| Edited By:

Jun 22, 2020 | 7:04 AM

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని ప్రముఖ అహోబిలం ఆలయంలోని పూజారికి కరోనా సోకింది.

అహోబిలం గుడి పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్
Follow us on

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని ప్రముఖ అహోబిలం ఆలయంలోని పూజారికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో పూజారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ మేనేజర్ వైకుంఠం వెల్లడించారు. దర్శనానికి ఎప్పుడు అనుమతిని ఇస్తామన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఇదివరకే దాదాపు రెండు నెలల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వకపోగా.. తాజాగా మరోసారి దర్శనాలకు బ్రేక్ పడింది. కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,516 మంది చికిత్స పొందుతున్నారు.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

Read This Story Also: Breaking: ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌకలో ప్రమాదం