కొబ్బరికాయల గణేషుడిని చూశారా..? ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాడో..!

| Edited By:

Sep 03, 2019 | 4:19 PM

తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రులు శోభాయమనంగా సాగుతున్నాయి. ఊరూరా వాడవాడలా కొలువు దీరిన మహా గణనాధులు విశేషాలంకరణలో భక్తుల పూజలందుకుంటున్నాడు. వింత వింత ఆకృతుల్లో గణేషుడు దర్శనమిస్తూంటాడు. ఎవరికీ వారే సాటి అన్న రీతిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహలు భక్తులను, చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చీరాలలో ప్రత్యేకమైన అవతారలలో వెలసిన గణనాథుడు ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ఉదయం నుండే భక్తి శ్రద్దలతో పూజలు ప్రారంభించిన భక్తులు వారి మొక్కులు […]

కొబ్బరికాయల గణేషుడిని చూశారా..? ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాడో..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రులు శోభాయమనంగా సాగుతున్నాయి. ఊరూరా వాడవాడలా కొలువు దీరిన మహా గణనాధులు విశేషాలంకరణలో భక్తుల పూజలందుకుంటున్నాడు. వింత వింత ఆకృతుల్లో గణేషుడు దర్శనమిస్తూంటాడు. ఎవరికీ వారే సాటి అన్న రీతిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహలు భక్తులను, చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చీరాలలో ప్రత్యేకమైన అవతారలలో వెలసిన గణనాథుడు ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ఉదయం నుండే భక్తి శ్రద్దలతో పూజలు ప్రారంభించిన భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమరా వారి వీధి శ్రీ గణపతి బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో గత 61 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణలో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. దీనిలో భాగంగా ఈ సారి 1008 కొబ్బరికాయలతో 12 అడుగులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే విధంగా చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక విగ్రహ ఆకారం ప్రత్యేక ఆకర్షణతో భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది శివ పార్వతుల చుట్టూ గణనాథఉడు ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఏర్పాటు చేసారు.