‘టీడీపీ హామీలు చైనా ప్రొడక్ట్స్ లాంటివి’.. విజయసాయిరెడ్డి పంచులు!

|

Feb 13, 2024 | 1:35 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి అనేక హామీలను గుప్పించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీకి విశ్వసనీయత లేదని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

టీడీపీ హామీలు చైనా ప్రొడక్ట్స్ లాంటివి.. విజయసాయిరెడ్డి పంచులు!
MP V Vijayasai Reddy
Follow us on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి అనేక హామీలను గుప్పించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీకి విశ్వసనీయత లేదని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ హామీలను చవకైన చైనా ఉత్పత్తులతో పోలుస్తూ సెటైర్లు వేశారు.

“కత్తిపోట్లు, అబద్ధాల చరిత్ర, అవకాశవాదం, అధికారాన్ని హైజాక్ చేయడానికి రాజీపడటం తప్ప భవిష్యత్తులో  TDP ఏమి చేయలేదు. టీడీపీ హామీలు కంటే చౌకైన చైనా ప్రొడక్ట్స్ మేలు. ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత నష్టపోవాల్సిందే. APని మోసం చేయడం మానేయండి,” అని ఆయన టీడీపీ నేతలనుద్దేశించి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను  విస్మరించడం చంద్రబాబు నాయుడు లక్షణం అన్నారు.

రెండ్రోజుల క్రితం శ్రీకాకుళంలో శంఖారావం బహిరంగ సభను ప్రారంభించిన సందర్భంగా నాయుడు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సూపర్ 6 మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. టీడీపీ హామీలలో ఏమున్నాయంటే..  5 సంవత్సరాలలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతోపాటు నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 15,000 అందించడం, అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 మంజూరు చేయడం. ప్రతి మహిళ ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ, 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చూస్తే అవి అవాస్తవికమని పేర్కొంటూ చంద్రబాబు నాయుడు హామీలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇప్పటికే ఎదురుదాడికి దిగారు. రూ.70 వేల కోట్లతో చేపట్టిన నవరత్నాలు పథకానికి కూడా నిధులివ్వడం సవాలేనని, నిధులు ఎక్కడి నుంచి తెస్తారని జగన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో వైసీపీ పార్టీ మాత్రం పోత్తు లేకుండా బరిలో దిగుతుండగా, టీడీపీ మాత్రం అటు జనసేన, ఇటు బీజేపీతో పొత్తు పెట్టకొని ఎలగైనా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో మరి.