రూ.8లక్షల విలువైన ఖైనీ, గుట్కా స్వాధీనం

|

Sep 17, 2019 | 4:15 PM

విజయనగరం జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. అధికారుల కళ్లు గప్పి కొందరు యద్దేచ్చగా గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. ఇవాళ విజయనగరం జిల్లా, ఎల్విన్పేట పోలీసు సర్కిల్‌ పరిధి గుమ్మలక్ష్మీపురం మండలం, ఎస్‌.కలిగట్టు గ్రామ సమీపంలో రెండు వ్యాన్‌ లలో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగుట్కా, ఖైనీని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గుట్కా , ఖైనీ విలువ  రూ.8,41,000 విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కా లతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి […]

రూ.8లక్షల విలువైన ఖైనీ, గుట్కా స్వాధీనం
Follow us on

విజయనగరం జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. అధికారుల కళ్లు గప్పి కొందరు యద్దేచ్చగా గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. ఇవాళ విజయనగరం జిల్లా, ఎల్విన్పేట పోలీసు సర్కిల్‌ పరిధి గుమ్మలక్ష్మీపురం మండలం, ఎస్‌.కలిగట్టు గ్రామ సమీపంలో రెండు వ్యాన్‌ లలో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగుట్కా, ఖైనీని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గుట్కా , ఖైనీ విలువ  రూ.8,41,000 విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కా లతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వ్యాన్‌ లను సీజ్‌ చేశారు. వీరిని కురుపాం కోర్టుకు తరలించనున్నట్లు సిఐ రమేష్‌ కుమార్‌ తెలిపారు.