ఎన్టీపీసీలో ఆర్టీపీపీ విలీనం ! కదం తొక్కిన కార్మికులు

|

Dec 20, 2019 | 4:10 PM

కడప జిల్లా యర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కార్మికులు రోడ్డేక్కారు. ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఎదుట ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీపీపీని ఎన్టీపీసీకి బదలాయించటం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. “ఎన్టీపీసీ గో బ్యాక్, డౌన్‌డౌన్‌ ఎపీ జెన్‌కో యాజమాన్యం’ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టును ఎన్టీపీసీకి బదలాయింపు చేసే పక్రియ వేగవంతం కావటంతో..ఉద్యోగస్తులు,ఎంప్లాయిస్ యూనియన్ లీడర్లు కలిసి మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగారు. మొత్తం […]

ఎన్టీపీసీలో ఆర్టీపీపీ విలీనం ! కదం తొక్కిన కార్మికులు
Follow us on

కడప జిల్లా యర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కార్మికులు రోడ్డేక్కారు. ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఎదుట ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీపీపీని ఎన్టీపీసీకి బదలాయించటం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. “ఎన్టీపీసీ గో బ్యాక్, డౌన్‌డౌన్‌ ఎపీ జెన్‌కో యాజమాన్యం’ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టును ఎన్టీపీసీకి బదలాయింపు చేసే పక్రియ వేగవంతం కావటంతో..ఉద్యోగస్తులు,ఎంప్లాయిస్ యూనియన్ లీడర్లు కలిసి మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగారు.

మొత్తం పవర్‌ సెక్టార్‌లో కలిపి నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే, ఒక్క ఆర్టీపీపీని మాత్రమే విలీనం చేస్తున్నారని కార్మికులు, ఉద్యోగులు ఆరోపించారు. ఆల్‌ ఇండియా లెవెల్‌లో ఎగ్జామ్ రాసిన ఉద్యోగస్తులు మాత్రమే ఎన్టీపీసీలో కొనసాగే అవకాశం ఉంటుందని, లోకల్‌గా రిక్రూట్‌ చేసుకున్న ఉద్యోగస్తులు ఎన్టీపీసీకి అవసరం ఉండరనే సమాచారంతో కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే రాయలసీమ మొత్తానికి ఏకైక పవర్‌ ప్రాజెక్ట్‌ అయినటువంటి రాయలసీమ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును ఎన్టీపీసీకి కట్టబెడితే, తమ భవిష్యత్‌ ఏంటని కార్మికులు ప్రశ్నించారు. విలీనంపై పూర్తి స్పష్టత ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కడపకు రానున్న నేపథ్యంలో అప్పటిలోపుగానే సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే, 23 నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ఆర్టీపీపీని ఏపీ జెన్‌కో లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.