మసాజ్‌ సెంటర్‌లో దూరిన పైథాన్

|

Aug 29, 2019 | 5:56 PM

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఓ మసాజ్‌ సెంటర్‌లో పైథాన్‌ హల్‌చల్‌ చేసింది. మసాజ్‌ సెంటర్‌లోని లిఫ్ట్‌లో దూరిన కొండచిలువ సిబ్బందిని, కస్టమర్లను హడలెత్తించింది. స్థానిక గోకులంలోని ఓ మసాజ్‌ సెంటర్‌లోని లిఫ్ట్‌లోకి కొండచిలువ దూరింది. అది గమనించని మసాజ్‌ సెంటర్‌ సిబ్బంది లిఫ్ట్‌ ఓపెన్‌ చేయగానే పైథాన్‌ ప్రత్యక్షమైంది. దీంతో భయపడిపోయిన సిబ్బంది గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతను ఆ పామును పట్టుకుని అడవిలో […]

మసాజ్‌ సెంటర్‌లో దూరిన పైథాన్
Follow us on

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఓ మసాజ్‌ సెంటర్‌లో పైథాన్‌ హల్‌చల్‌ చేసింది. మసాజ్‌ సెంటర్‌లోని లిఫ్ట్‌లో దూరిన కొండచిలువ సిబ్బందిని, కస్టమర్లను హడలెత్తించింది. స్థానిక గోకులంలోని ఓ మసాజ్‌ సెంటర్‌లోని లిఫ్ట్‌లోకి కొండచిలువ దూరింది. అది గమనించని మసాజ్‌ సెంటర్‌ సిబ్బంది లిఫ్ట్‌ ఓపెన్‌ చేయగానే పైథాన్‌ ప్రత్యక్షమైంది. దీంతో భయపడిపోయిన సిబ్బంది గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతను ఆ పామును పట్టుకుని అడవిలో వదిలి వేయటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా నాలుగు అంతస్తులు గల ఈ భవనంలో మసాజ్‌ సెంటర్‌, యోగా, ధ్యానం వంటివి నిర్వహిస్తుంటారు. విదేశీయులు, స్థానికులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలోనే కొండచిలువ ప్రత్యక్షంకావటంతో అంతా భయందోళనకు గురయ్యారు. వర్షాకాలం కావటంతో పొదల్లోని పాములు బయటకు వస్తాయని, వాటికి ఆవాసయోగ్యమైన స్థలంలో అవి సేదాతీరుతాయని చెబుతున్నారు స్నేక్‌ సోసైటీ సభ్యులు.