గర్భిణీ కి పోలీసులు చేయూత..పుట్టాడండి,పండంటి మగబిడ్డ !

|

Dec 09, 2019 | 4:24 PM

అనంతపురం జిల్లా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి పురుడు పోయించారు. వరలక్ష్మి అనే నిండు గర్భిణీ కాన్పు కోసం కడప నుంచి  కర్నూలు కు ట్రైన్‌లో బయల్దేరింది. తాడిపత్రి స్టేషన్‌ సమీపిస్తుండగా ఆమెకు ఉన్నట్టుండి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో బాధితురాలు 100 కు కాల్ చేసి చెప్పింది. వెంటనే స్పందించిన పోలీసులు 108 వాహనంతో తాడిపత్రి స్టేషన్ కు చేరుకున్నారు. వరలక్ష్మిని ఆ వాహనంలో ఓ […]

గర్భిణీ కి పోలీసులు చేయూత..పుట్టాడండి,పండంటి మగబిడ్డ !
Follow us on

అనంతపురం జిల్లా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి పురుడు పోయించారు. వరలక్ష్మి అనే నిండు గర్భిణీ కాన్పు కోసం కడప నుంచి  కర్నూలు కు ట్రైన్‌లో బయల్దేరింది. తాడిపత్రి స్టేషన్‌ సమీపిస్తుండగా ఆమెకు ఉన్నట్టుండి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో బాధితురాలు 100 కు కాల్ చేసి చెప్పింది. వెంటనే స్పందించిన పోలీసులు 108 వాహనంతో తాడిపత్రి స్టేషన్ కు చేరుకున్నారు. వరలక్ష్మిని ఆ వాహనంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు… అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి కాన్పు చేశారు. ఆస్పత్రికి చేరిన అరగంటలోనే వరలక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సకాలంలో స్పందించిన పోలీసులకు వరలక్ష్మీ ధన్యవాదాలు తెలిపింది..పోలీసులు చేసిన పనికి స్థానికులు సైతం ఎంతగానో అభినందించారు