రాత్రికి రాత్రే క్లాక్‌ టవర్‌ కూల్చివేత..!

| Edited By: Srinu

Dec 13, 2019 | 7:25 PM

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఏపీ ప్రభుత్వం పట్టినపట్టువిడవటం లేదు. గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కూల్చివేసే కార్యక్రమం కొనసాగిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న క్లాక్‌టవర్‌ను రాత్రికి రాత్రే మున్సిపల్‌ అధికారులు నేలమట్టం చేశారు. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్‌ సర్కిల్‌లో సుమారుగా కోటి రూపాయల నిధులతో నిర్మిస్తోన్న సెంట్రల్‌ లైటింగ్‌ క్లాక్‌టవర్‌ని రాత్రికి రాత్రే కూల్చివేయటంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను అర్ధరాత్రులు కూల్చివేయటమే ప్రభుత్వానికి […]

రాత్రికి రాత్రే క్లాక్‌ టవర్‌ కూల్చివేత..!
Follow us on

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఏపీ ప్రభుత్వం పట్టినపట్టువిడవటం లేదు. గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కూల్చివేసే కార్యక్రమం కొనసాగిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న క్లాక్‌టవర్‌ను రాత్రికి రాత్రే మున్సిపల్‌ అధికారులు నేలమట్టం చేశారు. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్‌ సర్కిల్‌లో సుమారుగా కోటి రూపాయల నిధులతో నిర్మిస్తోన్న సెంట్రల్‌ లైటింగ్‌ క్లాక్‌టవర్‌ని రాత్రికి రాత్రే కూల్చివేయటంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వం కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను అర్ధరాత్రులు కూల్చివేయటమే ప్రభుత్వానికి పరిపాటిగా మారిందంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో చంద్రబాబు మొదలు పెట్టిన భవనాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూల్చివేస్తుంటే..ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అదే పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసేది కాదని, కేవలం అభివృద్ధిని కూల్చివేసే ప్రభుత్వం అని ఆరోపించారు. ప్రజలందరూ ఇటువంటి దుర్మార్గపు చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.