అనుమతులు లేవా.. అయితే క్లోజ్ చేయండి.. విజయవాడలో స్కూళ్లపై కొరడా..

| Edited By:

Jul 27, 2019 | 2:27 PM

ఏపీలోని అనుమతులు లేని స్కూళ్ల పై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా నడుపుతున్న స్కూళ్లను సీజ్ చేస్తున్నారు. అంతేకాదు స్కూళ్ల యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. గత మూడు రోజులుగా డీఈవో రాజ్యలక్ష్మీ ఆధ్వర్యంలో అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నారు. పిల్లల్ని స్కూళ్లలో జాయిన్ చేసేటప్పుడు అనుమతులు ఉన్నాయో లేదో అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అనుమతుల పేరుతో స్కూళ్లు […]

అనుమతులు లేవా.. అయితే క్లోజ్ చేయండి.. విజయవాడలో స్కూళ్లపై కొరడా..
Follow us on

ఏపీలోని అనుమతులు లేని స్కూళ్ల పై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా నడుపుతున్న స్కూళ్లను సీజ్ చేస్తున్నారు. అంతేకాదు స్కూళ్ల యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. గత మూడు రోజులుగా డీఈవో రాజ్యలక్ష్మీ ఆధ్వర్యంలో అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నారు. పిల్లల్ని స్కూళ్లలో జాయిన్ చేసేటప్పుడు అనుమతులు ఉన్నాయో లేదో అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అనుమతుల పేరుతో స్కూళ్లు మూసివేయడం పై విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు తెరిచి నెలరోజులపైగా అయిందని, ఇప్పుడు అర్థాంతరంగా మూసివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించామంటున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్కూళ్ల ముందు ధర్నాకు దిగారు. స్కూళ్ల యాజమాన్యాలు తమను మోసం చేశాయని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.