చిట్టిల పేరుతో రూ.5 కోట్లకు పైగా కుచ్చుటోపీ

|

Sep 17, 2019 | 7:32 PM

చిత్తూరు జిల్లాలో చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో లూటీ చేసి పరారయ్యాడు ఓ కేటుగాడు. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా రూ. 5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడ్డాడు. చివరకు అందరికి కుచ్చుటోపి పెట్టి అడ్రస్‌ లేకుండా చెక్కేశాడు. చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేట గంగయ్య కుమారుడు బొడ్డలోకేశ్‌ అనే వ్యక్తి  గత 15 ఏళ్లుగా స్థానికంగానే ఉంటూ.. చిట్టీల వ్యాపారం సాగిస్తున్నాడు. స్థానికుడు కదా అనే నమ్మకంతో చుట్టు పక్కల జనాలు కూడా అతని వద్ద […]

చిట్టిల పేరుతో రూ.5 కోట్లకు పైగా కుచ్చుటోపీ
Follow us on

చిత్తూరు జిల్లాలో చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో లూటీ చేసి పరారయ్యాడు ఓ కేటుగాడు. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా రూ. 5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడ్డాడు. చివరకు అందరికి కుచ్చుటోపి పెట్టి అడ్రస్‌ లేకుండా చెక్కేశాడు. చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేట గంగయ్య కుమారుడు బొడ్డలోకేశ్‌ అనే వ్యక్తి  గత 15 ఏళ్లుగా స్థానికంగానే ఉంటూ.. చిట్టీల వ్యాపారం సాగిస్తున్నాడు. స్థానికుడు కదా అనే నమ్మకంతో చుట్టు పక్కల జనాలు కూడా అతని వద్ద పెద్ద మొత్తంలో చిట్టీలు వేశారు.

ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా లోకేష్‌ కనిపించకుండా పోవడంతో అతని కోసం ఇంటికి వెళ్లి
చూడగా ఇంటికి తాళం వేసి ఉండటంతో బాధితులు ఖంగుతిన్నారు. నగదు మొత్తం తీసుకుని లోకేష్ ఊడాయించాడని తెలుసుకున్న స్థానికులు భాకరపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూలీ పనులు చేసుకుంటూ నెలనెలా చిట్టీల పేరిట అతని వద్ద డబ్బులు జమచేశామని, అందరి చిట్టీలు కలిపి మొత్తం సుమారు రూ. 5 కోట్లకు పైగా ఉంటుందని ఖాతాదారులు చెబుతున్నారు. చివరకు తమను ఇలా నట్టేట ముంచేసి పరారుకావటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఎలాగైనా నిందితున్ని అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.