కర్నూలులో పాత కక్షలు..అర్థరాత్రి హై డ్రామా

|

Sep 14, 2019 | 3:02 PM

కర్నూలు జిల్లా ‌గోస్పాడు మండల కేంద్రంలో అర్దరాత్రి హై డ్రామా నెలకొంది..రెండు గ్రూపుల మద్య ఉన్నపాతకక్షల కారణంగా ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. స్థానికంగా నివాసించే మద్దిలేటి, మోహన్ రావు అనే వ్యక్తుల మద్య గత కొంత కాలంగా పాత కక్షలు కొనసాగుతున్నాయి. వీరిద్దరూ పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్దరాత్రి మద్దిలేటి గ్రూపుకు చెందిన మునెయ్యకు ఆటో తగిలించాడు. దీంతో వివాదం చినిచినికి గాలివానగా మారింది. మద్దిలేటి, మోహన్ రావు పరస్పరం […]

కర్నూలులో పాత కక్షలు..అర్థరాత్రి హై డ్రామా
Follow us on

కర్నూలు జిల్లా ‌గోస్పాడు మండల కేంద్రంలో అర్దరాత్రి హై డ్రామా నెలకొంది..రెండు గ్రూపుల మద్య ఉన్నపాతకక్షల కారణంగా ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. స్థానికంగా నివాసించే మద్దిలేటి, మోహన్ రావు అనే వ్యక్తుల మద్య గత కొంత కాలంగా పాత కక్షలు కొనసాగుతున్నాయి. వీరిద్దరూ పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్దరాత్రి మద్దిలేటి గ్రూపుకు చెందిన మునెయ్యకు ఆటో తగిలించాడు. దీంతో వివాదం చినిచినికి గాలివానగా మారింది. మద్దిలేటి, మోహన్ రావు పరస్పరం ఇళ్లపైకి వెళ్లి దాడులకు దిగారు. చేతికి దొరికిన కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. దాడిలో గాయపడిన మోహన్ రావు, మద్దిలేటి, మునెయ్య ముగ్గురు వేరువేరుగా చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఎదురుపడిన రెండు గ్రూపులు మళ్లీ వాదనలు దిగారు..వాగ్వాదం మరింత ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వచ్చిన తర్వాత రెండు గ్రూపుల వ్యక్తులు ఒకరి పై ఒకరు ఘర్షణ కు దిగారు. ఇరువర్గాల దాడిలో ఆస్పత్రి ‌డ్రస్సింగ్ రూమ్ అద్దాలు సైతం పగిలి పోయాయి. రెండు గ్రూపులను అదుపుచేయడానికి వెళ్ళిన కానిస్టేబుల్, ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుల పై కూడా దాడికి యత్నించారు. దీంతో ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న టుటౌన్, గోస్పాడు పోలీస్ స్టేషన్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. జరిగిన ఘటనతో స్థానికులు సైతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న..పాత కక్షల కారణంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.