వడ్డీ వ్యాపారి దారుణ హత్య

|

Nov 27, 2019 | 4:31 PM

తూర్పుగోదావరి జిల్లా తునిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వడ్డీ వ్యాపారినీ అతి దారుణంగా చంపేశారు కొందరు వ్యక్తులు. ఆర్థిక లావాదేవీల కారణంగా తోటి భాగస్వామియే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అనపర్తి నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక సీతారాంపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో పార్ట్‌నర్స్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో ముగ్గురి మధ్య […]

వడ్డీ వ్యాపారి దారుణ హత్య
Follow us on

తూర్పుగోదావరి జిల్లా తునిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వడ్డీ వ్యాపారినీ అతి దారుణంగా చంపేశారు కొందరు వ్యక్తులు. ఆర్థిక లావాదేవీల కారణంగా తోటి భాగస్వామియే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అనపర్తి నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక సీతారాంపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో పార్ట్‌నర్స్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో ముగ్గురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో క్షణికావేశంలో కర్రి మారెడ్డి సహచరుడు నల్లమిల్లి రాజారెడ్డిని కర్రతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి నల్లమిల్లి హారనాధరెడ్డి..(రాజారెడ్డి మేనల్లుడు) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజారెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అయితే, అప్పటికే రాజారెడ్డి చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వివరాలు మీడియాకు వెల్లడించారు స్థానిక పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు.