సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామివారు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలే అయినా ఏదో కొత్తదనం.. ఉత్సవాలను దర్శించి తరించాలన్నది భక్తుల అభిమతం.. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు, శుక్రవారం..

సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామివారు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలే అయినా ఏదో కొత్తదనం.. ఉత్సవాలను దర్శించి తరించాలన్నది భక్తుల అభిమతం.. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు, శుక్రవారం ఉదయం స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.. నిజానికి ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహనసేవ ఇదొక్కటే కానీ.. ఈసారి భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది.. కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా శ్రీవారిని తమ భుజస్కంధాలపై మోస్తూ, హృదయంలో పెట్టుకుని సేవిస్తారు. అలా వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు.. ఈ వాహనసేవ ఇచ్చే సందేశం ఇదే!

Click on your DTH Provider to Add TV9 Telugu