AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే!

|

Apr 26, 2024 | 5:55 PM

ఏపీలో ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు రాష్ట్ర ప్రజలను సతమతమయ్యేలా చేస్తున్నాయి. వరుణుడు వచ్చి ఇలా వాతావరణం చల్లార్చాడో.? లేడో.? ఇలా భానుడు తన భగభగలను ప్రజలపై చూపించేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు..

AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే!
Rains 5
Follow us on

ఏపీలో ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు రాష్ట్ర ప్రజలను సతమతమయ్యేలా చేస్తున్నాయి. వరుణుడు వచ్చి ఇలా వాతావరణం చల్లార్చాడో.? లేడో.? ఇలా భానుడు తన భగభగలను ప్రజలపై చూపించేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే అక్కడక్కడా చెదురుమదురు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య భాగాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ, మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రిపో ఆవరణంలో దక్షిణ లేదా నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
————————————

ఈరోజు:-

తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 – 50 కిమీ వేగంతో వీయవచ్చు.
వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు, రేపు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:-
——————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.