దొంగే దొంగదొంగ అన్నాడట..

|

Nov 01, 2019 | 6:09 PM

అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చోరీ నాటకమాడాడు ఓ ప్రబుద్ధుడు. బాకీ పోనూ ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ,  ప్లాన్‌ బెడిసి కొట్టింది. పోలీసులు ఇచ్చిన షాక్‌తో చివరకు జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందివర్గం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి శ్రీ రామ్ ఫైనాన్స్  ద్వారా ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడు…. సుమారు మూడు లక్షలకు పైగా శ్రీరామ్ […]

దొంగే దొంగదొంగ అన్నాడట..
Follow us on

అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చోరీ నాటకమాడాడు ఓ ప్రబుద్ధుడు. బాకీ పోనూ ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ,  ప్లాన్‌ బెడిసి కొట్టింది. పోలీసులు ఇచ్చిన షాక్‌తో చివరకు జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందివర్గం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి శ్రీ రామ్ ఫైనాన్స్  ద్వారా ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడు…. సుమారు మూడు లక్షలకు పైగా శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థకు బాకీ పడ్డాడు…ఈ సంస్థకు చెల్లించాల్సిన బాకీ నగదును చెల్లించాల్సిన పనిలేకుండా తప్పించుకునేందుకు ఓ పథకం రచించాడు…చోరీకి గురైనట్లు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని కంపెనీకి అందజేస్తే ఫైనాన్స్ కంపెనీ కి చెల్లించాల్సిన బాకీ చెల్లించాల్సిన అవసరం ఉండదని అప్పుతిప్పలు తప్పుతుందని సుబ్బరాయుడు భావించాడు… ఈ మేరకు ఒక కట్టుకథ సృష్టించాడు. తన ఇంటి ముందు ఉంచిన ట్రాక్టర్ ను  రాత్రి దొంగలు ఎత్తుకు పోయారని కట్టుకథ సృష్టించాడు. ఈ మేరకు నందివర్గం పోలీస్ స్టేషన్‌లో టాక్టర్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు


సుబ్బరాయుడు నాటకాన్ని పసిగట్ట ని పోలీసులు లు నిజంగా ట్రాక్టర్ చోరీకి గురైందని భావించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు  ప్రారంభించారు. పలువురు నేరస్తులను విచారణ చేశారు. అయితే చోరీ  చిక్కుముడి వీడలేదు. దీంతో సుబ్బరాయుడు వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. లోతుగా దర్యాప్తు చేయగా ఫిర్యాదు దారుడు సుబ్బరాయుడు నాటకం పోలీసులకు బయటపడింది. ఫిర్యాదు దారుడు సుబ్బరాయుడు పై నిఘా వేసి తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. సుబ్బరాయుడు తన ట్రాక్టర్ డ్రైవర్ వినోద్ కుమార్ లను  నిందితులు గా తేల్చారు. గురువారం పాణ్యం సీఐ నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో  నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.


నిందితుడు సుబ్బరాయుడికి అప్పుల బాధ ఎక్కువైందని, ఇతరుల నుండి తీసుకున్నప్పుడు అప్పులతో పాటు  ఫైనాన్స్ కంపెనీ కి చెల్లించాల్సిన అప్పులు తడిసి మోపెడు కావడంతో.. ఎలాగైనా అప్పుల బారి నుంచి  తప్పించుకునేందుకు పథకం ప్రకారం.. ట్రాక్టర్ బాడీ నెంబర్ మార్చేశాడు. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మార్చి ట్రాక్టర్ రంగును కూడా మార్చేశాడు. ఎవరు గుర్తు పట్టని విధంగా ట్రాక్టర్ ను పూర్తిగా మార్చివేసి  పాణ్యం మండల కేంద్రంలో సత్య రాజు అనే వ్యక్తి తో మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ట్రాక్టర్‌ని తాకట్టు పెట్టాడు. సత్య రాజుకు ట్రాక్టర్ ను అప్పజెప్పి …మూడు లక్షలు పుచ్చుకున్నాడు ….పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ట్రాక్టర్ తీసుకున్న శ్రీ రామ్ ఫైనాన్స్ కంపెనీ  కి అందజేశాడు. దీంతో కంపెనీకి చెల్లించాల్సిన  బాకీ చెల్లించకుండా బయటపడాలని  భావించాడు. అంతేకాక సదరు వాహన ఫైనాన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ సొమ్ము పొందాలని దురాశ పెంచుకున్నాడు. ఇదంతా పోలీసులు తమ విచారణలో బట్టబయలు చేశారు. నందివర్గం గ్రామానికి చెందిన సుబ్బారాయుడు రామతీర్థం గ్రామానికి చెందిన డ్రైవర్ వినోద్ కుమార్ ఇద్దరిపై కేసు నమోదు చేసి ఇద్దర్ని కటకటాల వెనక్కి నెట్టారు.