కర్నూలులో రోడ్డెక్కిన న్యాయవాదులు

| Edited By:

Sep 12, 2019 | 3:25 PM

కర్నూలలో హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద నాయ్యవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతము అత్యంత వెనుకబాటుకు గురైయిందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి అంతా ఓకే ప్రాంతానికి పరిమితం చేసిందని వారు మండిపడ్డారు. రాజధానిని, హైకోర్టును టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రాంతానికి తరలించి అన్యాయం చేసిందన్నారు. కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటు చేసి హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. […]

కర్నూలులో రోడ్డెక్కిన న్యాయవాదులు
Follow us on

కర్నూలలో హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద నాయ్యవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతము అత్యంత వెనుకబాటుకు గురైయిందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి అంతా ఓకే ప్రాంతానికి పరిమితం చేసిందని వారు మండిపడ్డారు. రాజధానిని, హైకోర్టును టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రాంతానికి తరలించి అన్యాయం చేసిందన్నారు. కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటు చేసి హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షకు రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మద్దతు తెలియజేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ లోని రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య వేదిక గా 17 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. రాయలసీమ ప్రాంతాని రెండో రాజధాని చేయాలని, న్యాయవాదుల న్యాయమైన కోరికలు వెంటనే
పరిష్కరించి కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని టిజి వెంకటేష్ కోరారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నేను కూడా ఢిల్లీలో నా వాదనలు వినిపిస్తానని  న్యాయవాదులకు టిజి వెంకటేష్ హామీ ఇచ్చారు.