అనంత మహాశివలింగానికి అంతర్జాతీయ గుర్తింపు..

| Edited By:

Aug 30, 2019 | 6:38 PM

పుట్టపర్తి మహాశివలింగ మ్యూజియానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆల్‌మా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌అవార్డును సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థ నిర్మించిన మహా శివలింగ మ్యూజియానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆల్‌ మా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలో ఈ మహాశివలింగ మ్యూజియంకు స్థానం దక్కింది. ఇందుకు గానూ ఇండోర్‌లోని మెరియా హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయ సంస్థ ప్రతినిధులకు అవార్డుని బహుకరించారు. విశ్వవిద్యాలయంలోనే అతిపెద్దదైన […]

అనంత మహాశివలింగానికి అంతర్జాతీయ గుర్తింపు..
Follow us on

పుట్టపర్తి మహాశివలింగ మ్యూజియానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆల్‌మా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌అవార్డును సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థ నిర్మించిన మహా శివలింగ మ్యూజియానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆల్‌ మా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలో ఈ మహాశివలింగ మ్యూజియంకు స్థానం దక్కింది. ఇందుకు గానూ ఇండోర్‌లోని మెరియా హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయ సంస్థ ప్రతినిధులకు అవార్డుని బహుకరించారు. విశ్వవిద్యాలయంలోనే అతిపెద్దదైన 75 అడుగుల ఈ శివలింగ మ్యూజియానికి ఇంతటి గుర్తింపు రావడంపై బ్రహ్మకుమారీలు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ శివలింగ మ్యూజియం సత్యసాయి సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి సమీపంలోని ఈశ్వరీయి విశ్వవిద్యాలయ సంస్థ నిర్మించింది. 75 అడుగుల ఎత్తు, 250 అడుగుల విస్తీర్ణం, 23స్టాళ్లతో, 44 అడుగుల ఎత్తులో అతి సుందరమైన ధ్యాన మందిరం కలిగి ఉండి..భక్తులను ఆకట్టుకునే ఆధ్యాత్మీక విశేషాలు కలిగి ఉంది. కనుకనే ఇంతటి గుర్తింపు లభించిందన్నారు మ్యూజియం ఇన్‌చార్జీ లక్ష్మీ.