Ongole: ఓహో.. ఎగ్జామ్ ఇలా రాయాలి అనమాట.. బానే ఉంది యవ్వారం

|

Aug 30, 2024 | 8:26 AM

ఒంగోలు రిమ్స్ కాలేజీలో మాస్‌ కాపీయింగ్ కలకలం రేపింది. ఒకే రూమ్‌లో 100మంది కూర్చోబెట్టి పబ్లిక్‌గా చిట్టీలు ఇచ్చి మాస్ కాపీయింగ్ రాయిస్తున్నారు అధికారులు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Ongole: ఓహో.. ఎగ్జామ్ ఇలా రాయాలి అనమాట.. బానే ఉంది యవ్వారం
Mass Copying
Follow us on

ఒంగోలు రిమ్స్‌ కాలేజీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకున్నారు. GNM నర్సు పోస్టులకోసం నిర్వహించిన పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్ చోటు చేసుకుంది‌. చిట్టీలు పెట్టి మరీ అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఒకే హాల్‌లో గుంపులు గుంపులుగా ఏర్పడి అభ్యర్దినులు పక్క పక్కనే కూర్చుని పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని సమాచారం అందడంతో మీడియా ఎంటరైంది. అభ్యర్ధులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలను మీడియా చిత్రీకరించడంతో కాపీలను బయటకు విసిరేశారు.

పారదర్శకంగా నిర్వహించాల్సిన GNM పరీక్షలను పరీక్షా నిర్వాహకులు, నర్సింగ్‌ కాలేజీల యాజమాన్యాలు కుమ్మక్కై మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఒంగోలు రిమ్స్‌ కళాశాలలో జరిగిన మాస్‌ కాపీయింగ్‌పై విచారణ చేసి పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

అభ్యర్థుల నుంచి వేలల్లో డబ్బులు తీసుకొని పాస్‌ చేస్తామని చెప్పి మాస్‌ కాపీయింగ్‌ పాల్పడుతున్నారంటూ విద్యాసంస్థలపై మండిపడుతున్నారు. ఇంత పబ్లిక్‌గా మాస్‌ కాపీయింగ్ జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.