పేద రోగులకు సీఎం భరోసాః ఏపీలో కొత్త స్కీం

|

Dec 03, 2019 | 3:14 PM

ఆరు నెలల పరిపాలన కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ తాజాగా మరో పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిందే తడువు..రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రజానీకానికి మరో శుభవార్త నందించారు సీఎం జగన్‌. రాష్ట్రంలో రూ. 5 లక్షల లోపు ఆదాయం వున్న వారందరికీ జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి  వెల్లడించారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని […]

పేద రోగులకు సీఎం భరోసాః ఏపీలో కొత్త స్కీం
Follow us on
ఆరు నెలల పరిపాలన కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ తాజాగా మరో పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిందే తడువు..రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రజానీకానికి మరో శుభవార్త నందించారు సీఎం జగన్‌. రాష్ట్రంలో రూ. 5 లక్షల లోపు ఆదాయం వున్న వారందరికీ జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి  వెల్లడించారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ కార్డులలో రోగి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారని, చికిత్స ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆరోగ్య భరోసా కార్యక్రమాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..మూడేళ్ల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు.. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 2వేల రకాల వ్యాధులను చేరుస్తున్నట్టు సీఎం తెలిపారు. అందులో భాగంగానే కేన్సర్ రోగులకు సైతం ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప జేయనున్నట్లుగా వెల్లడించారు. వైఎస్సార్ ఆరోగ్య భరోసాను తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించి వచ్చే ఏప్రిల్ నుంచి  అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు…ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి డిసెంబర్‌ 1 నుంచి రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తామమన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లో జమ చేస్తామని తెలిపారు… 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక విశ్రాంతి తీసుకునే కాలానికి ఈ నగదు సాయం పొందేందుకు  రోగి డిశ్చార్జి అయ్యే సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు వివరాలు ఇవ్వాలని కోరారు..  ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమ చేస్తామని అన్నారు.. దీనికోసం ప్రతి ఏటా రూ. 268.13 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జగన్ వెల్లడించారు.