మాడుగుల నియోజకవర్గంలో రసవత్తర పోరు

| Edited By:

Mar 25, 2019 | 3:38 PM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఈ కోవలోనే విశాఖ జిల్లాలోని గవిరెడ్డి కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మూడు పార్టీల్లో చేరి నిజమైన‌ రాజకీయ నాయకులమని నిరూపించుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో ఉండే గవిరెడ్డి దేముడుబాబు, సన్యాసమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. వీరిలో తొలి ముగ్గురు సంతానం రాజకీయాల్లో ఉన్నారు. పలు సినిమాల్లో నటించిన సుజాత అలియాస్ రమ్యశ్రీ వైసీపీలో చేరగా, సన్యాసినాయుడు జనసేన, […]

మాడుగుల నియోజకవర్గంలో రసవత్తర పోరు
Follow us on

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఈ కోవలోనే విశాఖ జిల్లాలోని గవిరెడ్డి కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మూడు పార్టీల్లో చేరి నిజమైన‌ రాజకీయ నాయకులమని నిరూపించుకుంటున్నారు.

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో ఉండే గవిరెడ్డి దేముడుబాబు, సన్యాసమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. వీరిలో తొలి ముగ్గురు సంతానం రాజకీయాల్లో ఉన్నారు. పలు సినిమాల్లో నటించిన సుజాత అలియాస్ రమ్యశ్రీ వైసీపీలో చేరగా, సన్యాసినాయుడు జనసేన, రామానాయుడు టీడీపీ తరపున ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

సుజాత సినిమా రంగంలో రమ్యశ్రీగా గుర్తింపు పొందారు. తన పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరి ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

గవిరెడ్డి సన్యాసినాయుడు… ‘జీఎస్‌ఎన్‌ ట్రస్టు’ను స్థాపించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించినా స్పష్టమైన హామీ రాకపోవడంతో జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున మాడుగుల బరిలో నిలిచారు.

గవిరెడ్డి రామానాయుడు తొలినాళ్లలో విశాఖలో బంగారు నగల విక్రయ దుకాణం నిర్వహించేవారు. రాజకీయాల్లో ప్రవేశించాక 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మాడుగులలో అన్నదమ్ములు ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండటంతో ఆసక్తి నెలకొంది.