ఫీషర్‌మెన్‌ సాహసానికి సత్కారం..ఇంతకీ ఏం చేశాడో తెలుసా..?

| Edited By: Srinu

Aug 16, 2019 | 6:55 PM

అతడో సామాన్య మత్స్యకారుడు…రోజు పడవ వేసుకుని వెళ్లి చేపల్ని పట్టడం అతని వృత్తి..అయితే, అతడు చేసిన సాహసాన్నిగుర్తించిన ఏపీ ప్రభుత్వం అవార్డును అందజేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా..? నలుగురికి ప్రాణం పోశాడు…గోదావరిలో మునిగిపోతున్న నలుగురు యువకులను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. పశ్చిమగోదావరి జిల్లా కోడేరుకు చెందిన మత్స్యకారుడు కొప్పాక కాళీస్వామిని ప్రభుత్వం గుర్తించి అవార్డు ప్రదానం చేసింది. గత నెల 13వ తేదీన హైదరాబాద్‌కు చెందిన అయిదురు యువకులు ద్వారకాతిరుమల సందర్శనానంతరం ఆచంట మండలంలోని […]

ఫీషర్‌మెన్‌ సాహసానికి సత్కారం..ఇంతకీ ఏం చేశాడో తెలుసా..?
Follow us on
అతడో సామాన్య మత్స్యకారుడు…రోజు పడవ వేసుకుని వెళ్లి చేపల్ని పట్టడం అతని వృత్తి..అయితే, అతడు చేసిన సాహసాన్నిగుర్తించిన ఏపీ ప్రభుత్వం అవార్డును అందజేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా..? నలుగురికి ప్రాణం పోశాడు…గోదావరిలో మునిగిపోతున్న నలుగురు యువకులను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. పశ్చిమగోదావరి జిల్లా కోడేరుకు చెందిన మత్స్యకారుడు కొప్పాక కాళీస్వామిని ప్రభుత్వం గుర్తించి అవార్డు ప్రదానం చేసింది. గత నెల 13వ తేదీన హైదరాబాద్‌కు చెందిన అయిదురు యువకులు ద్వారకాతిరుమల సందర్శనానంతరం ఆచంట మండలంలోని మాచేనమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవటానికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు కోడేరువద్ద గోదావరిలో స్నానం చేసుందుకు దిగి అయిదుగురు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో పడవలో అటుగా వస్తున్న కాళీస్వామి వెంటనే స్పందించి నలుగురు యువకులను కాపాడాడు. ఒకరు గల్లంతై ప్రాణాలు కొల్పోయారు. నలుగురిని సాహసోపేతంగా రక్షించిన కాళీస్వామిని అధికారులు గుర్తించి ప్రభుత్వానికి అతని సేవలను నివేదించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాళీస్వామికి అవార్డు ఇచ్చి సత్కరించింది ప్రభుత్వం. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కలెక్టర్‌ ముత్యాలరాజు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.