Andhra Pradesh: నేడు కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన.. అధికారుల ముమ్మర ఏర్పాట్లు

|

May 13, 2022 | 8:56 AM

నేడు కోనసీమ(Konaseema) జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) పర్యటించనున్నారు. ఐ.పోలవరం మండలంలోని మురమళ్లలో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని....

Andhra Pradesh: నేడు కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన.. అధికారుల ముమ్మర ఏర్పాట్లు
Ys Jagan
Follow us on

నేడు కోనసీమ(Konaseema) జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) పర్యటించనున్నారు. ఐ.పోలవరం మండలంలోని మురమళ్లలో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45 గంటలకు మురమళ్ల వద్దకు సీఎం చేరుకుంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేయనున్నారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలుగుతోంది. కార్యక్రమం తర్వాత…మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరిగి బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో…మురమళ్ళలో ఏర్పాట్లను ముమ్మడివరం ఎమ్మెల్యే వెంకట సతీష్ పరిశీలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Adivi Sesh: చందమామ సినిమా క్యాన్సిల్ కావడానికి కారణం అదే.. యంగ్ హీరో అడివి శేష్ ఆసక్తికర కామెంట్స్..

Health Tips: కడుపులో గ్యాస్‌, ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. కిచెన్‌లో ఉండే ఈ పదార్థాలతో చక్కటి ఉపశమనం..!