వెల్లంపల్లి వెనక్కితిరిగి చూసుకోవాలి: పురందేశ్వరి

|

Sep 14, 2020 | 2:16 PM

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి కౌంటరిచ్చారు. అంతర్వేది ఘటనకు సంబంధించి మంత్రి.. బిజెపిపై విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. వెల్లంపల్లి బిజెపిలో..

వెల్లంపల్లి వెనక్కితిరిగి చూసుకోవాలి: పురందేశ్వరి
Follow us on

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి కౌంటరిచ్చారు. అంతర్వేది ఘటనకు సంబంధించి మంత్రి.. బిజెపిపై విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. వెల్లంపల్లి బిజెపిలో ఉన్న సమయంలో ధార్మిక సంస్థలతో కలిసి బిజెపి ఏ విధంగా పోరాటం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. తమ తప్పిదాలను మరొకరిపై నెట్టివేసి తప్పించుకోవాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ కోసం వైసిపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం చేస్తున్న వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో విజయవాడలో పుష్కరాల నిర్వహణకోసం 25 గుళ్ళను ధ్వంసం చేశారని ఆమె గుర్తు చేశారు. ఏ పార్టీలో లేని విధంగా బిజెపి పార్టీలో ధార్మిక విభాగం పనిచేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 70 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పురందేశ్వరి చెప్పారు. అందులో భాగంగా ఒంగోలులో సామాన్య ప్రజలకు మాస్క్‌లు, శానిటైజర్లను పురందేశ్వరి పంపిణీ చేశారు.