AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవదు.. అందుకే బెదిరింపులకు పాల్పడుతున్నారు

|

Feb 06, 2021 | 12:56 PM

Andhra Pradesh Panchayat Election: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, ఎస్‌ఈసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి..

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవదు.. అందుకే బెదిరింపులకు పాల్పడుతున్నారు
Follow us on

Andhra Pradesh Panchayat Election: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, ఎస్‌ఈసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవదని, అందుకే రాద్ధాంతం చేస్తూ టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. టీడీపీ బెదిరింపులకు ఎవరు కూడా బయపడవద్దన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యకాండపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఏకగ్రీవ ఎన్నికలైన చోట గెలిచిన వారికి డిక్లరేషన్‌లు ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. కుప్పంలో కొందరు అధికారులు, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీని రాష్ట్ర ప్రజలు సమాధి చేశారని, ఇప్పుడు నిమ్మగడ్డ సమాధి నుంచి ఆ పార్టీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తగా పని చేస్తున్నారని, మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ టీడీపీలో చేరబోతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: మరో నగారాకు సిద్ధమవుతున్న ఏపీ ఎస్‌ఈసీ, పంచాయతీ ముగిసిన వెంటనే ఆ ఎన్నికలకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్న నిమ్మగడ్డ..?