గుడ్‌న్యూస్‌.. ఏపీలో కోలుకున్న తొలి కరోనా బాధితుడు..!

| Edited By:

Mar 22, 2020 | 10:30 AM

భారత్‌లో చేప కింద నీరులా విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 256 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వేల సంఖ్యలో అనుమానితులున్నారు.

గుడ్‌న్యూస్‌.. ఏపీలో కోలుకున్న తొలి కరోనా బాధితుడు..!
Follow us on

భారత్‌లో చేప కింద నీరులా విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 256 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వేల సంఖ్యలో అనుమానితులున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. అటు ఏపీలో5 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. ఇటు తెలంగాణలో వారి సంఖ్య 21కు చేరింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏపీలో మొదటి కరోనా పాజిటివ్ బాధితుడు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇటలీ నుంచి రాగా.. అతడికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతడి శాంపిల్స్‌ను పుణెకు పంపగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీలో నమోదైన మొదటి పాజిటివ్ కేసు ఇతడిదే. ఈ నేపథ్యంలో దాదాపు 14 రోజుల పాటు అతడిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు. ఇక అతడు కోలుకుంటూ రాగా.. తాజా రిపోర్టులో కరోనా నెగిటివ్ గా తేలింది. ఈ క్రమంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైనల్ రిపోర్ట్ రాగానే అతడిని ఇంటికి పంపుతామని డాక్టర్లు చెబుతున్నారు. కాగా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాల జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దానికి మద్దతు తెలుపుతూ దేశ ప్రజలందరూ ఇండ్లకు పరిమితమయ్యారు.

Read This Story Also: నాంపల్లిలో కరోనా అనుమానితుడు.. నగరంలో టెన్షన్ టెన్షన్..!