మేకిన్‌ ఇండియాలో అందరూ భాగస్వాములే : ఏపీ గవర్నర్‌

| Edited By:

Aug 17, 2019 | 7:07 PM

మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్‌ బలమైన అణుశక్తిగా ఎదిగిందన్నారు. ఎలాంటి ఛాలెంజ్‌ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. గాంధీ కలలుగన్న భారతదేశ […]

మేకిన్‌ ఇండియాలో అందరూ భాగస్వాములే : ఏపీ గవర్నర్‌
Follow us on
మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్బంగా పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్‌ బలమైన అణుశక్తిగా ఎదిగిందన్నారు. ఎలాంటి ఛాలెంజ్‌ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. భారత్‌ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.