ఏసీబీ వలలో మహిళ వీఆర్వో

|

Nov 27, 2019 | 9:03 PM

ఓ వైపు తెలుగురాష్ట్రాల్లో రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ప్రకంపనలు చెలరేగుతున్నాయి. మరోవైపు అధికారుల్లో అవినీతి మాత్రం తగ్గటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ మహిళ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ బిట్‌-1 గ్రామంలో లంచం తీసుకుంటుండగా, లావణ్య అనే మహిళా వీఆర్వోను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అడంగల్‌లో పేరు మార్పిడి కోసం లోకేష్‌ అనే రైతు వద్ద నుండి రూ. 3వేలు లంచం డిమాండ్‌ […]

ఏసీబీ వలలో మహిళ వీఆర్వో
Follow us on

ఓ వైపు తెలుగురాష్ట్రాల్లో రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ప్రకంపనలు చెలరేగుతున్నాయి. మరోవైపు అధికారుల్లో అవినీతి మాత్రం తగ్గటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ మహిళ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ బిట్‌-1 గ్రామంలో లంచం తీసుకుంటుండగా, లావణ్య అనే మహిళా వీఆర్వోను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అడంగల్‌లో పేరు మార్పిడి కోసం లోకేష్‌ అనే రైతు వద్ద నుండి రూ. 3వేలు లంచం డిమాండ్‌ చేయడంతో, సమాచారం అందుకున్న ఏసీబీ రంగంలోకి దిగింది.