ఏసీబీ వలలో అవినీతి ఆర్‌అండ్‌బీ ఆఫీసర్‌

|

Oct 29, 2019 | 7:22 AM

ఏసీబీ వలలో అవినీతి చేప పట్టుబడింది. కడప జిల్లా రాజంపేట ఆర్. అండ్.బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ప్రభాకర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రాయచోటికి చెందిన సాదు ఓబుల్‌ రెడ్డి అనే సివిల్‌ కాంట్రాక్టర్‌ 2017- 2018 సంవత్సరానికి సంబంధించి రాయచోటీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీ గోడ నిర్మించుటకు రూ. 25 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2018లో పనులన్నీ పూర్తి కావడంతో, అప్పట్లో 15 లక్షల రూపాయలు బిల్లు […]

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌అండ్‌బీ ఆఫీసర్‌
Follow us on
ఏసీబీ వలలో అవినీతి చేప పట్టుబడింది. కడప జిల్లా రాజంపేట ఆర్. అండ్.బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ప్రభాకర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రాయచోటికి చెందిన సాదు ఓబుల్‌ రెడ్డి అనే సివిల్‌ కాంట్రాక్టర్‌ 2017- 2018 సంవత్సరానికి సంబంధించి రాయచోటీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీ గోడ నిర్మించుటకు రూ. 25 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2018లో పనులన్నీ పూర్తి కావడంతో, అప్పట్లో 15 లక్షల రూపాయలు బిల్లు మంజూరు కాగా, అందులో టాక్స్లు వగైరా అన్ని పోనూ,  రూ. 3లక్షల 15వేల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆ బిల్లును విడుదల చేయమని రాజంపేట ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ జి.ప్రభాకర్‌ రావును కోరాడు. అందుకు గానూ ఆయన రూ. 10 లక్షలు లంచం డిమాండ్‌ చేశారని..ఆరోపిస్తూ..ఓబుల్ రెడ్డి ఎసిబిని ఆశ్రయించాడు.. వెంటనే స్పందించిన ఎసిబి అధికారులు వల పన్ని ఓబుల్ రెడ్డి నుంచి ప్రబాకర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.. కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.