అమెరికాలో మళ్ళీ అదే ‘సీన్’ ! నల్లజాతీయుడి కాల్చివేత

| Edited By: Pardhasaradhi Peri

Jun 14, 2020 | 12:00 PM

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యను మరువకముందే అట్లాంటాలో మరో నల్లజాతీయుడు హత్యకు గురయ్యాడు. రేషార్డ్ బ్రూక్స్ అనే 27 ఏళ్ళ యువకుడిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ ఘటనకు నిరసనగా..

అమెరికాలో మళ్ళీ అదే సీన్ ! నల్లజాతీయుడి కాల్చివేత
Follow us on

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యను మరువకముందే అట్లాంటాలో మరో నల్లజాతీయుడు హత్యకు గురయ్యాడు. రేషార్డ్ బ్రూక్స్ అనే 27 ఏళ్ళ యువకుడిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ ఘటనకు నిరసనగా ఆందోళనకారులు ఇంటర్ స్టేట్ హైవే ని దిగ్బంధం చేశారు. తమ సిబ్బంది చర్యకు బాధ్యత వహిస్తూ అట్లాంటా పోలీసు ఛీఫ్ ఎరికా షీల్డ్స్ తన పదవికి రాజీనామా చేశారు. బ్రూక్స్ శుక్రవారం రాత్రి తన కారును ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద అడ్డంగా నిలిపి కారులో నిద్రపోయాడని, అయితే ఆ రెస్టారెంట్ యజమానులు.. ఇతర కస్టమర్లు తమ హోటల్ కు రాకుండా ఇతడు ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని నిద్ర లేపి ప్రశ్నిస్తుండగా వారితో వాదులాటకు దౌర్జన్యానికి దిగాడని  తెలిసింది. పైగా ఆ పోలీసుల్లో ఒకరి వద్ద ఉన్న రేసర్ లాక్కుని పారిపోవడానికి యత్నించాడు. (రేసర్ తో ఎదుటి వ్యక్తిని.. తలపడకుండా నిస్తేజం చేయవచ్చునట).. దీంతో సదరు పోలీసు తప్పనిసరిగా అతనిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన బ్రూక్స్ ని హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పటికే జార్జి హత్యతోను, పోలీసుల రెసిజానికి వ్యతిరేకంగాను అమెరికాలో పెద్ద ఎత్థున ఆందోళనలు, హింసాత్మక ప్రదర్శనలు జరుగుతుండగా తాజాగా జరిగిన ఈ ఘటన మళ్ళీ హింసను ప్రేరేపించవచ్చ్చునని భయపడుతున్నారు.

Video Courtesy: Mail Online