ఎన్నికల ప్రచారంపై ఎండల ప్రభావం…ఆస్పత్రిలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు

ఏపీలో పెరిగిన ఎండలు..వడగాలుల వల్ల ఎన్నికల ప్రచారానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వడదెబ్బ తగిలింది. వెంటనే ప్రసాద్‌ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎండలో ప్రచారం చేయడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి కూడా వడదెబ్బ తగిలింది. […]

ఎన్నికల ప్రచారంపై ఎండల ప్రభావం...ఆస్పత్రిలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 10:21 AM

ఏపీలో పెరిగిన ఎండలు..వడగాలుల వల్ల ఎన్నికల ప్రచారానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వడదెబ్బ తగిలింది. వెంటనే ప్రసాద్‌ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎండలో ప్రచారం చేయడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి కూడా వడదెబ్బ తగిలింది. ప్రచారం చేస్తుండగా అస్వస్థతతకు గురికాగా… వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ప్రచారానికి బ్రేకులు వేశారు.