హెచ్ఐవీ సోకిన మహిళలో కోవిద్ ఇన్ఫెక్షన్లు,….32 వైరస్ మ్యుటేషన్లు…. ఆశ్చర్యపోతున్న రీసెర్చర్లు…స్టడీకి రెడీ అయిన డాక్టర్లు

| Edited By: Anil kumar poka

Jun 06, 2021 | 10:28 AM

దక్షిణాఫ్రికాలో ఓ మహిళ ఉదంతం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. 36 ఏళ్ళ ఈ మహిళకు హెచ్ఐవీ సోకింది.. పైగా 216 రోజులపాటు కోవిద్ ఇన్ఫెక్షన్లతో సతమతమవడమే కాదు... తన శరీరంలో 32 వైరస్ మ్యుటేషన్లను..

హెచ్ఐవీ సోకిన మహిళలో కోవిద్ ఇన్ఫెక్షన్లు,....32 వైరస్ మ్యుటేషన్లు.... ఆశ్చర్యపోతున్న రీసెర్చర్లు...స్టడీకి రెడీ అయిన డాక్టర్లు
Woman With Hiv Has 32 Covid Virus 32 Mutations
Follow us on

దక్షిణాఫ్రికాలో ఓ మహిళ ఉదంతం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. 36 ఏళ్ళ ఈ మహిళకు హెచ్ఐవీ సోకింది.. పైగా 216 రోజులపాటు కోవిద్ ఇన్ఫెక్షన్లతో సతమతమవడమే కాదు… తన శరీరంలో 32 వైరస్ మ్యుటేషన్లను డెవలప్ చేసుకుందట ..అంటే ఆమె బాడీలోకి ఇన్ని వైరస్ మ్యుటేషన్లు ప్రవేశించాయని ఆమెను పరీక్షించిన డాక్టర్లు, వైద్య నిపుణులు తెలిపారు. ఈ సరికొత్త వింత చూసి వారు షాక్ తిన్నారు. ఇలాంటి కేసు బహుశా ప్రపంచంలో ఇదే మొదటిదని అంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఆమెకు 2020 సెప్టెంబరులో కోవిద్ పాజిటివ్ సోకింది. ఆ తరువాత ఆమె శరీరంలో ఇన్ని వైరస్ మ్యుటేషన్లు ప్రవేశించాయని అక్కడి మెడికల్ జర్నల్ ఓ ఆర్టికల్ ని ప్రచురించింది. మొదట 13, ఆ తరువాత 19 మ్యుటేషన్లు ఎలా ప్రవేశించాయో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు. వైరస్ ‘బిహేవియర్’ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందట… బ్రిటన్ లో మొదట గుర్తించిన బీ.1.1.7, ఆ తరువాత ఎన్.510 వై మ్యుటేషన్, (ఇది బేటా వేరియంట్ బీ.1.351 లో భాగమట)..వీటిలో కనుగొన్నారు. చివరిది తొలుత సౌతాఫ్రికాలో గుర్తించారు. ఇంతకీ ఈ మహిళ బతికే ఉందా..ఉంటే ఎలా ఉంది అన్న విషయాలు తెలియలేదు.

హెచ్ఐవీ రోగుల్లో మ్యుటేషన్ కి, కోవిద్ వైరస్ కి స్ట్రాంగ్ లింక్ ఉంటుందని అంటున్నారు. అయితే ఇంకా దీనిపై పరిశోధనలు జరగాలంటున్నారు. ఇండియాలో సుమారు 10 లక్షల మంది హెచ్ఐవీ రోగులున్నారని అంచనా..ఈ నేపథ్యంలో ఈ సరికొత్త ‘వింత’ ఇండియా వంటి దేశాలకు ఆందోళనకరమే కాగలదని వైద్య బృందం పేర్కొంటోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Today Gold Rate, Silver Price Video: పసిడిప్రియులకు కాస్త ఊరట. గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతున్నా బంగారం ధరకు బ్రేక్.

కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.

హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ కొండల్లో కనిపించిన అరుదైన ,అతి విషపూరితమైన కింగ్ కోబ్రా : King Cobra Video

ఈ పిల్లి చేష్టలు చుస్తే నవ్వాపుకోలేరు..వేరే పిల్లిని పిలుస్తున్న యజమానిపై ఓ పిల్లి కోపం:Cat Viral Video