Potato Chips Lines: కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే ఆ మజాయే వేరు!

|

Oct 27, 2024 | 9:37 AM

చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది ఇష్టపడే స్నాక్స్​లో ఆలూ చిప్స్‌ ఒకటి. సాయంత్రం వేళ కరకరలాడే స్పైసీ చిప్స్ తింటూ చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కొందరికైతే ఛాయ్ తాగుతున్నా, భోజనం చేస్తున్నా.. బంగాళదుంప చిప్స్ తినే అలవాటు ఉంటుంది. ప్రస్తుతం చాలా రకాల కంపెనీలు మన దేశంలో పెద్ద ఎత్తున పొటాటో చిప్స్ విక్రయిస్తున్నాయి.

ఆలూ చిప్స్‌ను చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఇష్టంగా తింటుంటారు. చిప్స్​లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో కొన్ని సార్లు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల క‌డుపు నొప్పి, గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తిపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనేక వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ఎటాక్ చేస్తాయట. దాంతో వ్యాధుల ముప్పు పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

అందుకే ఆలూ చిప్స్ అధికంగా తీసుకోకూడదు. మితంగా తినాలి అంటుంటారు. అధికంగా తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే వీటి తయారీలో నూనె, ఉప్పు అధికంగా యూజ్ చేస్తుంటారు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇది బాడీలో చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆలూ చిప్స్​లో ఉండే అక్రిలమైడ్ అనే రసాయనం క్యాన్సర్​కు కూడా కారణమవుతుందట. అలాగే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ డీప్ ఫ్రై చేసిన చిప్స్ వంటి స్నాక్స్ జోలికి వెళ్లకూడదట. ఎందుకంటే.. ఇలాంటి ఆహారం వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఆలూ చిప్స్‌ కారణంగా డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే కరకరలాడే ఆలూచిప్స్‌ని 1824లో తొలిసారి తన హోటల్‌కి వచ్చిన కస్టమర్‌కి రుచి చూపించాడట అమెరికాలో షెఫ్‌గా పనిచేసిన జార్జ్‌ స్పెక్‌. కస్టమర్‌కి బాగా నచ్చడంతో చిప్స్‌ని మెనూలో చేర్చి అందించడం మొదలుపెట్టారట. ఆ తర్వాత ఆ రుచికి ప్రపంచదేశాలు ఫిదా అయిపోయాయి. ప్రస్తుతం ప్యాకెట్ చిప్స్ లో మనకు గీతలు కనిపిస్తాయి. ఈ గీతలు ఎందుకంటే.. చిప్స్‌పై మసాలాలు సమానంగా అంటుకుని రుచి పెరిగేలా వీటిని డిజైన్ చేశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.