Elephant Yam: రెండేళ్ల క్రితం కంద మొక్కను నాటిన రైతు.. తాజాగా దుంప కోసం తవ్వగా.. చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు.వీడియో.

|

Feb 10, 2023 | 10:03 PM

గ్రామాల్లో చాలామంది ఇళ్లలోనే కూరగాయల మొక్కలను పెంచుకుంటారు. ఎరువులు, పురుగు మందులు వేయకుండా అవసరమైన కూరగాయలను సహజంగా పండించుకుంటారు. అందుకు తగిన స్థలం ఉంటుంది కాబట్టి.

గ్రామాల్లో చాలామంది ఇళ్లలోనే కూరగాయల మొక్కలను పెంచుకుంటారు. ఎరువులు, పురుగు మందులు వేయకుండా అవసరమైన కూరగాయలను సహజంగా పండించుకుంటారు. అందుకు తగిన స్థలం ఉంటుంది కాబట్టి. అలానే కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని పాతఎడ్లలంక గ్రామానికి చెందిన రైతు కోప్పనాతి అంకరాజు ఇంట్లో కూరగాయల చెట్లను పెంచుతున్నాడు. ఆయన 2 సంవత్సరాల క్రితం పెరట్లో కంద దుంప మొక్కను నాటాడు. తాజాగా కంద గడ్డ కోసం తవ్వగా.. అది ఏకంగా 20 కేజీలపైగా బరువు ఉండంటం చూసి ఆ రైతు స్టన్ అయ్యాడు. జనరల్‌గా కంద దుంపలు మహా అయితే 10 కేజీల లోపే బరువు ఉంటాయి. ఈ రైతు పండించిన దుంప కాటా వేయగా 21 కేజీలు తూగింది. స్థానిక ప్రజలను ఈ దుంప ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత పెద్ద కంద దుంపను తామెప్పుడు చూడలేదని గ్రామస్థులు అంటున్నారు. క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడకుండానే కేవలం కుళాయి దగ్గర్లో ఈ మొక్కను పెంచినట్లు సదరు రైతు తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 10, 2023 10:03 PM