Power Cut: దేశం మొత్తం కరెంట్‌ పోయింది.. నరకం చూసిన జనం.!

|

Jun 23, 2024 | 4:44 PM

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో దేశం మొత్తం ఒకేసారి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. నగరం మొత్తం ఒకేసారి కరెంటు పోతేనే మనం విలవిల్లాడుతాం. అలాంటిది దేశం మొత్తం కొన్ని గంటలపాటు విద్యుత్తు లేకపోతే పరిస్థితి ఏమిటీ..? ఆస్పత్రులు, ఇళ్లు, సబ్‌వేలు, రైల్వేలైన్లు ఇలా ప్రతీ ఒక్క వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది.

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో దేశం మొత్తం ఒకేసారి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. నగరం మొత్తం ఒకేసారి కరెంటు పోతేనే మనం విలవిల్లాడుతాం. అలాంటిది దేశం మొత్తం కొన్ని గంటలపాటు విద్యుత్తు లేకపోతే పరిస్థితి ఏమిటీ..? ఆస్పత్రులు, ఇళ్లు, సబ్‌వేలు, రైల్వేలైన్లు ఇలా ప్రతీ ఒక్క వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. ఇలాంటి పరిస్థితే ఈక్వెడార్‌లో తలెత్తింది. బుధవారం దేశం మొత్తం ఒకేసారి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌ సిగ్నళ్ల నుంచి రైల్వే లైన్ల వరకు అన్నిరకాల వ్యవస్థలు నిలిచిపోయాయి. విద్యుత్తు నిర్వహణ, ట్రాన్స్‌మిషన్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెప్పారు. చిన్నపిల్లల ఆస్పత్రులు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.

కొత్త పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు, నిర్వహణకు సరైన నిధుల కేటాయింపు లేకపోవడంతోనే విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలిందని పబ్లిక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ మంత్రి రాబర్టో లూక్యూ అన్నారు. కొన్ని గంటలపాటు అంధకారం తర్వాత బుధవారం అర్ధరాత్రికి తిరిగి దేశంలో 95 శాతం ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. 2004 తర్వాత ఈ దేశంలో విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలడం ఇదే తొలిసారి. ఈక్వెడార్‌ గత కొన్నేళ్లుగా విద్యుత్తు సమస్యతో తీవ్ర అవస్థలు పడుతోంది. ఇటీవల ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడు ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు. దీంతోపాటు రోజువారీ ఎనిమిది గంటలపాటు కరెంటు కోతలు కూడా అమలుచేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.