Gold Ambaji Temple: అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
గుజరాత్‌లోని ప్రధాన పవిత్ర స్థలాలలో అంబా ఆలయం ఒకటి. అంబాజీ దేవాలయం అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. అలాగే అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా విశేష ఆదరణ పొందింది. అంబ, శ్రీకృష్ణుడి దేవతా విగ్రహాలతో కనువిందు చేసే ఈ అందమైన ఆలయం అహ్మదాబాద్ నుండి దాదాపు 179 కి.మీ.ల దూరంలో ఉంది. ఇటీవల ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి విశేష పూజలు చేయడంతో దేశమంతటా ఆలయం పేరు మారుమోగి పోయింది.

తాజాగా అంబాజీ ఆలయ శిఖరానికి బంగారు తాపడం పనులు కొనసాగుతున్నాయి. బంగారాన్ని విరాళంగా ఇవ్వాలన్న ఆలయ ట్రస్టీ పిలుపుతో దేశ విదేశాల్లోని భక్తులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నారైలు మహేంద్ర పటేల్ అతని సోదరుడు హర్షద్ శిఖరానికి జరిగే తాపడం పనులకు తమ వంతు విరాళంగా బంగారాన్ని పంపించారు. ఈ సందర్భంగా 48 లక్షల రూపాయలు విలువ చేసే కేజీ బంగారాన్ని గోల్డ్ బిస్కెట్ల రూపంలో అంబాజీ మందిర్ దేవస్థాన్ ట్రస్ట్‌కు పటేల్ సోదరుల తండ్రి అందించారు. అమెరికాలో ‘పటేల్ బ్రదర్స్’ గ్రోసరీ సంస్థను తన కుమారులు అంబాజీ మాత ఆశీస్సులతో నిర్వహిస్తున్నట్లు పటేల్ సోదరుల తండ్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.