Viral Video: ఓరి దేవుడో.. సముద్రం ఒడ్డున నిలిపి ఉన్న పడవ పై ఒక్కసారిగా పడిన పిడుగు.. వణుకు పుట్టిస్తున్న వీడియో
వర్షం పడేముందు ఉరుములు ఉరమడం, మెరుపులు రావడం చూస్తుంటాం. ఇక ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో పిడుగులు పడుతుంటాయి. ప్రస్తుతం మెరుపులు, పిడుగులకు సంబంధించిన వీడియో
వర్షం పడేముందు ఉరుములు ఉరమడం, మెరుపులు రావడం చూస్తుంటాం. ఇక ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో పిడుగులు పడుతుంటాయి. ప్రస్తుతం మెరుపులు, పిడుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ను చూసిన తర్వాత కచ్చితంగా వెన్నులో వణుకు పుడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రంలో చాలా పడవలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒడ్డున నిలిపి ఉన్నాయి. ఆ సమయంలో కొద్దిగా వర్షం కురుస్తోంది. ఇంతలో కొన్ని సెకన్ల వ్యవధిలో ఒక మెరుపు వచ్చి ఓ పడవను తాకింది. దాంతో పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికైనా నష్టం జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ వీడియో చాలా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 9 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..