Huge Cobra: పశువుల షెడ్డు నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతుకు షాక్..!

|

Apr 14, 2024 | 6:07 PM

అప్పటి వరకూ పొలంలో పనులు చేసుకుంటూ ఉన్న రైతు కాస్త సేదతీరేందుకు పశువుల కొట్టం దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూర్చుని సేదతీరుతున్న సమయంలో అతనికి పశువుల కొట్టంలోనుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని వెళ్లి పరిశీలించి చూసిన రైతుకు ఓ పెద్ద గిరినాగు కనిపించింది. హడలిపోయిన అతను ఒక్క ఉదుటన వెనక్కి పరుగెత్తాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

అప్పటి వరకూ పొలంలో పనులు చేసుకుంటూ ఉన్న రైతు కాస్త సేదతీరేందుకు పశువుల కొట్టం దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూర్చుని సేదతీరుతున్న సమయంలో అతనికి పశువుల కొట్టంలోనుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని వెళ్లి పరిశీలించి చూసిన రైతుకు ఓ పెద్ద గిరినాగు కనిపించింది. హడలిపోయిన అతను ఒక్క ఉదుటన వెనక్కి పరుగెత్తాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మాడుగుల మోదకొండమ్మ ఆలయ సమీపంలో 12 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. కొండలరావు అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులోకి చేరింది . భయభ్రాంతులకు గురైన రైతు.. స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగిన స్నేక్ క్యాచర్.. ఆ భారీ గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..