కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిలింనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి యత్నం కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని వికారాబాద్ తరలించారు. దాడి కేసులో సూత్రదారిగా ఉన్న భోగమోని సురేష్‌తో పట్నం నరేందర్ రెడ్డి పలు మార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.