German VAY: రిమోట్ కారే.. కానీ బొమ్మ కారు కాదు.! అమెరికాలో రోడ్డెక్కిన రిమోట్ కార్లు.
ఇంటి బయటకు వెళ్లాలంటే అద్దెకు కార్లను బుక్ చేసుకునే వారి సంఖ్య ఇటీవల నగరాలలో ఎక్కువైంది. రెంటల్ కార్లను సొంతంగానే డ్రైవ్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతుంటారు. రెంటల్ కారును ఇంటి వద్దకు తెచ్చి తాళాలు ఇచ్చి వెళ్లేందుకు తప్పనిసరిగా డ్రైవర్ రావలసి ఉంటుంది. కానీ డ్రైవర్ లేకుండానే రిమోట్ డ్రైవింగ్‌తో క్యాబ్ తనంతట తానుగా మీ ఇంటికొచ్చేలా జర్మన్ సంస్థ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జర్మన్ స్టార్టప్ "వే'' రిమోట్ డ్రైవర్ సహాయంతో నడిచే క్యాబ్‌ల వాణిజ్య సేవల్ని తాజాగా అమెరికాలో ప్రారంభించింది.
ఇంటి బయటకు వెళ్లాలంటే అద్దెకు కార్లను బుక్ చేసుకునే వారి సంఖ్య ఇటీవల నగరాలలో ఎక్కువైంది. రెంటల్ కార్లను సొంతంగానే డ్రైవ్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతుంటారు. రెంటల్ కారును ఇంటి వద్దకు తెచ్చి తాళాలు ఇచ్చి వెళ్లేందుకు తప్పనిసరిగా డ్రైవర్ రావలసి ఉంటుంది. కానీ డ్రైవర్ లేకుండానే రిమోట్ డ్రైవింగ్‌తో క్యాబ్ తనంతట తానుగా మీ ఇంటికొచ్చేలా జర్మన్ సంస్థ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జర్మన్ స్టార్టప్ “వే” రిమోట్ డ్రైవర్ సహాయంతో నడిచే క్యాబ్‌ల వాణిజ్య సేవల్ని తాజాగా అమెరికాలో ప్రారంభించింది. లాస్ వెగాస్ నగరంలోని నెవాడా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వే క్యాబ్ సేవల్ని అందిస్తుంది. రిమోట్ డ్రైవింగ్ రెంటల్ క్యాబ్ బుక్ చేసిన వారికి వారి ఇంటి ముంగిట డ్రైవర్ లేని కారు వచ్చి నిలబడుతుంది. అద్దె సమయం ముగిసిన తర్వాత సదరు వ్యక్తి కారు దిగగానే ఇంటి దగ్గర నుంచి వాహనం తిరిగి దానంతట అదే వెనక్కి వెళుతుంది. ఆధునిక రిమోట్ డ్రైవింగ్ టెక్నాలజీ సహాయంతో సంస్థ కార్యాలయంలో ఉన్న వ్యక్తి కారును రిమోట్‌గా డ్రైవ్ చేస్తాడు. ఈ సేవలను క్రమంగా విస్తరించి త్వరలో వాహనంలో అటానమస్ ఫీచర్లను కూడా ప్రవేశపెడతామని వే సంస్థ సీఈవో థామస్ వాండెర్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెలి డ్రైవింగ్ లేదా రిమోట్ డ్రైవింగ్‌కు అదనంగా అటానమస్ ఫీచర్లు జోడించి భవిష్యత్ కార్లను రూపొందిస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos