Anti Ragging App: టేలెంట్‌కు అరుదైన గుర్తింపు.. 13 ఏళ్ల చిన్నారి “యాంటీ ర్యాగింగ్” యాప్‌కు .. రూ. 50 లక్షల నిధులు..
anti ragging app: ఈ 13 ఏళ్ళ బాలిక పేరు అనుష్క జాలీ. గురుగ్రామ్‌లోని ద పాత్‌వేస్ స్కూల్లో ఎనిమిదో క్లాస్ చదువుతోంది. మూడేళ్ల క్రితం వేధింపులకి వ్యతిరేకంగా.. విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, నిపుణుల సహాయంతో .. ది యాంటీ బుల్లీయింగ్ స్క్వాడ్ ఆన్‌లైన్ వేదికను ప్రారంభించింది.
ఈ 13 ఏళ్ళ బాలిక పేరు అనుష్క జాలీ. గురుగ్రామ్‌లోని ద పాత్‌వేస్ స్కూల్లో ఎనిమిదో క్లాస్ చదువుతోంది. మూడేళ్ల క్రితం వేధింపులకి వ్యతిరేకంగా.. విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, నిపుణుల సహాయంతో .. ది యాంటీ బుల్లీయింగ్ స్క్వాడ్ ఆన్‌లైన్ వేదికను ప్రారంభించింది. దీని ద్వారా 100 పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన 2,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ప్రస్తుతం జాలీ ‘కవచ్’ పేరుతో మొబైల్ యాప్ ను రూపొందించింది. దీని సహాయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వేధింపులపై అజ్ఞాతంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫలితంగా సంబంధిత పాఠశాలలు, కౌన్సిలర్లు జోక్యం చేసుకోవడానికి వీలవుతుంది. కాగా తాజాగా జాలీ .. షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షోలో పాల్గొంది. జాలీ ఆలోచన మెచ్చి, యాప్ విస్తరణకు షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్, బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా 50 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..