Employment crisis in USA: ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్! అమెరికాలో తెలుగు టెకీల పరిస్థితి ఏమిటి?
అమెరికాకు మనవారితో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది చదువుకోవడానికి వెళతారు. అలా 2022-2023 లో దాదాపు రెండు లక్షల మంది అక్కడ ల్యాండయ్యారు. అందులో మనవాళ్లు దాదాపు నాలుగోవంతు మంది ఉన్నట్టు అంచనా. వీరిలో చాలామంది కల.. అమెరికాలో ఎంఎస్ లో కంప్యూటర్ సైన్స్ చదవాలని. అలాగే దీనితో లింక్ ఉన్న మరికొన్ని కోర్సులు కూడా చేసి.. జాబ్ కొట్టాలన్న ఆశయంతో ఉంటారు. నిజం చెప్పాలంటే కొవిడ్ వచ్చినప్పటికీ, ఇప్పటికీ మధ్యలో.. వీరిలో దాదాపు 85 శాతం మందికి జాబ్స్ వచ్చాయి. దీంతో చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఆ ఆనందం ఎన్నో ఏళ్లు నిలవలేదు. మరి మనవాళ్ల పరిస్థితి ఏమిటి?
అమెరికాలో ఉద్యోగం చాలామంది కల. అందులోనూ మన తెలుగువారు ఎక్కువమందికి అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలి.. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని చాలా కలలు కంటారు. ఇందులో ఐటీ రంగంవారే ఎక్కువగా ఉంటారు. అందుకే వారిపైనే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతోంది. H1B వీసా వచ్చినవాళ్లు, లక్షల కొద్దీ ప్యాకేజీలు తీసుకుంటున్నవాళ్లు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలీ సిట్యుయేషన్ రావడానికి కారణాలేంటి? తెలివైనవాళ్లుగా పేరు తెచ్చుకుని.. అపార అనుభవాన్ని గడించిన వారికి ఇలాంటి సీన్ ఎందుకు ఎదురవుతోంది? ఇక్కడ లక్షల కొద్దీ ప్యాకేజీలతో వచ్చిన ఉద్యోగాలను వదిలి.. అమెరికాలో MS చదివి.. ఇప్పుడక్కడ జాబ్ లేని వారి పరిస్థితి ఏమిటి? ఎందుకు వారికి కొలువులు ఇవ్వడం లేదు?
గత పాతికేళ్లలో చూడనంతగా అమెరికాలో ఉద్యోగాల విషయంలో సంక్షోభం నెలకొంది. ఉన్న ఉద్యోగం పోయి.. కొత్త ఉద్యోగం రాక అక్కడున్నవారిలో చాలామందికి దిక్కుతోచడం లేదు. ఓవైపు మంత్లీ మెయింటెనెన్స్ కోసం కొందరు.. హోటళ్లతోపాటు మరికొన్ని చోట్ల పనిచేస్తున్నారు. దాంతోపాటే ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు వారిని మరో భయం వెంటాడుతోంది. అదే బ్యాంక్ లోన్. ఉన్నత చదువుల కోసం ఎంతోమంది ఎడ్యుకేషన్ లోన్ ను తీసుకున్నారు. ఇప్పుడు దానిని తీర్చాలంటే జాబ్ తప్పనిసరి. దాదాపు 89 శాతం మంది లేఆఫ్ ల విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అమెరికాలో ఇంతగా జాబ్స్ తగ్గడానికి కారణమేంటి? ఎక్కువమందిని ఎందుకు తీసేస్తున్నారు? కొత్తవారిని ఎందుకు తక్కువగా తీసుకుంటున్నారు? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూడవచ్చు.