Heavy Rain: అర్ధరాత్రి పిడుగుల బీభత్సం.! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన

|

Apr 22, 2024 | 9:45 PM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విరగడంతో కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. బయ్యారంలో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురవగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విరగడంతో కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. బయ్యారంలో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురవగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం సత్యనారాయణపురం గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. ఏజెన్సీ ప్రాంతంలో వరి, మక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు కూలిపడగా మామిడికాయలు రాలిపోయాయి. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డిగూడెంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!