గూడూరులో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణీకులు ఆందోళన..(Video)

|

Nov 18, 2022 | 8:32 AM

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి.

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. ట్రైన్ లోని ప్యాంట్రీ కార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతోప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును గూడూరు రైల్వే స్టేషన్లో ఆపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా రైలు సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది.

Published on: Nov 18, 2022 08:32 AM