Urvashi Rautela: బాలయ్య సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు తీవ్ర గాయాలు..

|

Jul 12, 2024 | 10:16 AM

వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తెరకెక్కిస్తోన్న ఎన్‌బీకే 109 మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరగుతోంది. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ కోసం ఊర్వశి హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయం తీవ్రతపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊర్వశి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

బాలకృష్ణ లేటెస్ట్ సినిమా NBK 109లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తోన్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు తీవ్రగాయమైంది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఊర్వశి కాలు ఫ్రాక్చర్ అయ్యిందని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని ఆమె టీమ్ తెలిపింది. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తెరకెక్కిస్తోన్న ఎన్‌బీకే 109 మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరగుతోంది. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ కోసం ఊర్వశి హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయం తీవ్రతపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊర్వశి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

బాలయ్య మోస్ట్ అవేటెడ్ మూవీగా.. ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతెలాతో పాటు తెలుగమ్మాయి చాందిని చౌదరీ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడు నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. . సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్‌గా బాలయ్య బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిఈజ్ చేసిన వీడియో గ్లింప్స్‌.. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను స్కై హైకి సెట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.