నా హెల్మెట్ చూడండి.. చలాన్ రాసుకోండి.. గుజరాతీ నయా ప్రయోగం

Vadodara Man Pastes All Bike Documents On Helmet, నా హెల్మెట్ చూడండి.. చలాన్ రాసుకోండి.. గుజరాతీ నయా ప్రయోగం

ఇప్పుడు ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కొత్త వెహికిల్ చట్టం గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేశాడు. అతడి నిర్వాకం ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్న రామ్ షా, తన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ స్లిప్‌లను అతికించిన హెల్మెట్‌ ధరించి రోడ్ల పై తిరగడం మొదలు పెట్టాడు. దీనివల్ల ఎక్కడ పోలీసులు అతన్ని పట్టుకున్నా తన వెహికిల్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు తనతోనే ఉంటాయని.. తాను ఎలాంటి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం, ఫోన్‌లో మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న గుజరాత్ పోలీస్ అధికారి ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటో ఆధారంగా వివరాలు సేకరించిన పై అధికారులు అతనికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. దీనిపై విజయ్ రూపానీ ప్రభుత్వం కూడా అధికారులతో చర్చలు జరిపింది. త్వరలోనే గుజరాత్‌లో కూడా న్యూ వెహికిల్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు విజయ్ రూపానీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *