Lok Sabha Election: ఆ ఇద్దరు సీనియర్ లీడర్లకు పెద్ద టాస్క్‌గా మారిన లోక్‌సభ ఎన్నికలు.. వ్యుహాలకు నేతల పదును!

ఇద్దరు రాజకీయ ఉద్దండులు ఈ ఎంపీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడంతో మెదక్ జిల్లా రాజకీయలు చాలా ఇంట్రెస్ట్ గా మారాయి. పార్టీ సమావేశాల్లో విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఎలాగైనా ఈ ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీ అధిష్టానానికి గిఫ్ట్ ఇచ్చి, తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఈ ఇద్దరు నేతలు తెగ తాపత్రయ పడుతున్నారట.

Lok Sabha Election: ఆ ఇద్దరు సీనియర్ లీడర్లకు పెద్ద టాస్క్‌గా మారిన లోక్‌సభ ఎన్నికలు.. వ్యుహాలకు నేతల పదును!
Damodara Rajanarsimha, Harishrao
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 11, 2024 | 6:36 PM

ఆ ఇద్దరు సీనియర్ నేతలకు లోక్‌సభ ఎన్నికలు టాస్క్ గా మారాయట. ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట ఆ ఇద్దరు సీనియర్ లీడర్స్. ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ పార్లమెంటు ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పనిచేస్తున్నారు ఆ ఇద్దరు లీడర్లు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు లీడర్లు రాజకీయాల్లో క్రియాశీలక నేతలు. వాళ్లకు ఈ ఎంపీ ఎన్నికలు పెద్ద బాధ్యతలను తెచ్చిపెట్టాయి. వారెవరో కాదు ఒకరు ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ కాగా, మరొకరు మాజీ మంత్రి హరీష్ రావు. ఇద్దరు రాజకీయల్లో ఆరితేరినవారే.ఇప్పుడు వీరికి ఈ ఎంపీ ఎన్నికలు టాస్క్ లా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహ, హరీష్ రావు ఇద్దరు రాజకీయ ఉద్దండులే. ఇద్దరు రాష్ట్ర రాజకీయాలను శాసించే నేతలే. అలాంటి వారికి ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎన్నికలు పెద్ద టాస్క్ గా మారాయి.

తెలంగాణ ఉద్యమం నుండి మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్‌కు కంచుకోట. మొత్తం పది నియోజకవర్గలు ఉంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 7 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కొల్పోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. సాధారణ ఎన్నికలు తరవాత వచ్చిన మొదటి ఎన్నికలు ఈ ఎంపీ ఎన్నికలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి.

అధికారంలోకి వచ్చిన ఊపులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆధికారం కొల్పోయిన కసితో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అందుకే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు అయిన మెదక్, జహీరాబాద్ పై హరీష్ రావు, దామోదర రాజనర్సింహ దృష్టి సారించారు. ఈ ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు కింది స్థాయి నేతలతో టచ్ లో ఉంటూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గనికి దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం..ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపై రెండు పార్టీలు దృష్టి సారించాయి. మరో వైపు జహీరాబాద్ ఇంచార్జ్ గా దామోదర రాజనర్సింహ ఉన్నప్పటికీ కూడా మెదక్ పార్లమెంటులో ఎక్కడ ఏ సమస్య వచ్చిన దామోదర దాన్ని సెట్ చేస్తున్నారు. దామోదర రాజనర్సింహ, హరీష్ రావు నిత్యం తమ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు.

ఈ ఎంపీ ఎన్నికల్లో పార్టీకి గెలుపు ఎంత అవసరమో కార్యకర్తలకు వివరిస్తున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఈ ఎంపీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు అయిన మెదక్, జహీరాబాద్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచేలా వ్యూహలు రచిస్తున్నారు. ఒక్కరోజు ఒక పార్లమెంట్ పరిధిలో మూడు లేదా నాలుగు మీటింగ్‌ల్లో తానే స్వయంగా పాల్గొనేలా ప్రోగ్రాంలు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్లమెంట్ నియోజకవర్గల అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచనలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇలా ఇద్దరు రాజకీయ ఉద్దండులు ఈ ఎంపీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడంతో మెదక్ జిల్లా రాజకీయలు చాలా ఇంట్రెస్ట్ గా మారాయి. పార్టీ సమావేశాల్లో విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఎలాగైనా ఈ ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీ అధిష్టానానికి గిఫ్ట్ ఇచ్చి, తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఈ ఇద్దరు నేతలు తెగ తాపత్రయ పడుతున్నారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..