Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..

స్మార్ట్ సిటీ మిషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ పనులను మార్చి 2025 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు కొనసాగనున్నాయి. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..
Chief Minister Revanth Reddy met Union Minister for Housing and Urban Affairs Manohar Lal Khattar
Follow us

|

Updated on: Jul 01, 2024 | 8:47 AM

స్మార్ట్ సిటీ మిష‌న్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి జూన్‌తో ముగిసింది. తెలంగాణలో వరంగల్​, కరీంనగర్​ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తయ్యాయి. 518 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయి. 287 కోట్ల రూపాయలతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయి.

స్ట్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో ప్రజా ప్రయోజనార్థం ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..