యూపీ.. మధురలో రెచ్చిపోయిన వలస కార్మికులు.. బ్యారికేడ్లను విరగగొట్టుకుని..

యూపీలోని మధురలో శనివారం సాయంత్రం వలస కార్మికులు దాదాపు విధ్వంసానికి దిగారు. పెద్ద సంఖ్యలో వస్తున్న వీరిని సరిహద్దుల వద్ద నిలిపివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించడంతో..

యూపీ.. మధురలో రెచ్చిపోయిన వలస కార్మికులు.. బ్యారికేడ్లను విరగగొట్టుకుని..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2020 | 5:36 PM

యూపీలోని మధురలో శనివారం సాయంత్రం వలస కార్మికులు దాదాపు విధ్వంసానికి దిగారు. పెద్ద సంఖ్యలో వస్తున్న వీరిని సరిహద్దుల వద్ద నిలిపివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించడంతో.. ఎక్కడివారినక్కడే నిలిపివేశారు.  సుమారు 130 మంది వలస జీవులు సరైన ఆహారం లేక, ఇతర అనారోగ్య సమస్యలతో మధ్యలోనే మృతి చెందడంతో ముఖ్యమంత్రి  ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా వీరంతా తమ కుటుంబాలతో మధుర హై వే పైకి వచ్ఛేసి,, బ్యారికేడ్లను విరిచేస్తూ పరుగులు తీస్తూ సిటీ వైపు వచ్చారు. అక్కడ ఒక్క అధికారిగానీ, పోలీసు గానీ లేరు. తమకు ఆహారం గానీ, షెల్టర్ గానీ లేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వీరు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ విధమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.