శాసనకర్తగా ఉద్ధవ్ థాకరే

|

May 14, 2020 | 8:40 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే శాసనమండలిలో అడుగుపెట్టాడు. శాసనమండలికి పోటీ లేకుండా ఉద్ధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయనతో పాటు మరో మరో ఎనిమిది మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఇప్పటి వరకు ఉద్దవ్ థాకరే శాసనసభ, శాసనమండలి సభ్యుడు కాకుండానే సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 6 నెలల్లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ […]

శాసనకర్తగా ఉద్ధవ్ థాకరే
Follow us on

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే శాసనమండలిలో అడుగుపెట్టాడు. శాసనమండలికి పోటీ లేకుండా ఉద్ధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయనతో పాటు మరో మరో ఎనిమిది మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు.
ఇప్పటి వరకు ఉద్దవ్ థాకరే శాసనసభ, శాసనమండలి సభ్యుడు కాకుండానే సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 6 నెలల్లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలం గోర్హే (శివసేన), బీజేపీ నుంచి రంజిత్ సింగ్ మోహితే పాటిల్, గోపీచంద్ పడాల్కర్, ప్రవీణ్ డాట్కే, రమేశ్ కరాడ్, ఎన్సీపీ నుంచి శశికాంత్ షిండే, అమోల్ మిత్కారీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్ ఉన్నారు.
మండలిలో ఈ తొమ్మిది స్థానాలు ఏప్రిల్ 24న ఖాళీ అయ్యాయి. ఈ తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమయం ముగిసింది. తొమ్మిది స్థానాలకూ ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆ వెంటనే వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో… శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శాసనకర్తగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని ఉద్దవ్ థాకరే.. గత ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, ఎమ్మెల్సీగా ఉద్ధవ్ ఎన్నిక కావడంతో శివసైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు.